Header Banner

ఉమ్మడి గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం! జీఎంసీ కాల్ సెంటర్..

  Fri May 16, 2025 12:36        Entertainment

ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. గుంటూరులో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకూలాయి. పలు వంతెనల కింద వర్షపు నీరు నిలిచింది. ఏటీ అగ్రహారం, నల్లచెరువు ప్రాంతాల్లో నీరు రోడ్లపైకి చేరింది. కంకరకుంట అండర్పాస్ లోపలకు వర్షపు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీఎంసీ సిబ్బంది అండర్పాస్ నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. పల్నాడు జిల్లాలో వర్షాలకు మిర్చి పంటకు నష్టం జరిగింది. కల్లాల్లో ఆరబెట్టిన పంట తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్దనపూడి-వింజనంపాడు మధ్య వాగు పొంగుతోంది. బాపట్ల జిల్లాలో పర్చూరు వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో తోటల్లో మామిడి నేలరాలింది. కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు, బోగోలులో వర్షం పడింది. గుంటూరు జిల్లాలో వర్షాల దృష్ట్యా జీఎంసీ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. జీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సమస్యలపై జీఎంసీ నంబర్ 08632345103 ను సంప్రదించాలని కోరారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather